టిఆర్ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. ఇంట్లోని మహిళా సిబ్బంది ఛాతి మీద రాయితో కొట్టి దాడి చేయడం ఎందుకోసమని ప్రశ్నించారు. కవిత పార్టీ మారుతున్నట్లు తనకు తెలిసింది కాబట్టే మాట్లాడానని అన్నారు ఎంపీ అరవింద్. మల్లికార్జున ఖర్గే కు ఫోన్ చేసిందా లేదా అనేది ముందు తేలాలని అన్నారు.
తనకి తెలిసిన విషయం తాను చెప్పానని అన్నారు. ఖర్గేను కలిసిందా లేదా అనేది కవిత స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ అరవింద్. తన ఇంట్లో మహిళపై దాడి చేయించిన కవిత మహిలేనా? అని ప్రశ్నించారు. దమ్ముంటే రావమ్మా.. నా మీద పోటీ చెయ్ అని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్, కవిత, కేటీఆర్ కుల అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను 2024లో మళ్లీ నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని.. రా చూసుకుందాం అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.