మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు బీఎల్ సంతోష్ గైర్హాజర్‌పై హైకోర్టు విచారణ నిర్వహించింది. బీఎల్ సంతోష్ సిట్ ముందు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని ఏజీ కోరారు. సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయాలని కోర్టు సిట్‌ను ఆదేశించింది. సిట్ విచారణకు బీఎల్ సంతోష్ గైర్హాజరుపై హైకోర్టు విచారణ చేపట్టింది. సంతోష్ సిట్ ముందు హాజరయ్యేలా ఆదేశించాలని ఏజీ కోర్టును కోరారు.
ఈనెల 20న సంతోష్‌కు నోటీసులు అందినా హాజరుకాలేదని తెలిపారు. సంతోష్ విచారణకు వచ్చేలా చూసే బాధ్యత పిటిషనర్‌పై ఉందని ధర్మాసనం పేర్కొంది. నిర్దిష్ట తేదీతో మరో 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు. సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయాలని కోర్టు సిట్‌ను ఆదేశించింది. ఈ మెయిల్ ఐడీకి నోటీసులు జారీ చేయాలని తెలిపింది. అన్ని వివరాలతో ఈ నెల 29న కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. తదుపరి విచారణను 30న చేపడతామని వెల్లడించింది హైకోర్టు.