తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోంది : గుత్తా సుఖేందర్ రెడ్డి

-

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక వనరులను కట్టడి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఐటీ రైడ్స్ బీజేపీ వ్యూహంలో భాగమేనని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఐటీ రైడ్స్ పేరుతో మంత్రులను ఇబ్బంది పెడుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం వైఖరి మార్చుకోవాలన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే.. అభివృద్ధి చేసి చూపించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని హితవు పలికారు.

Gutta sukhender reddy: మతోన్మాదులకు గుణపాఠం చెప్పేలా మునుగోడు ప్రజల తీర్పు  | Legislative Council Chairman Gutta Sukhender Reddy nalgonda telangana  suchi

ఆర్థిక వనరులను కట్టడి చేయాలనే దురాలోచనలో ఉందని చెప్పారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే చర్య అని ఫైరయ్యారు. ఇప్పటికైనా కేంద్ర వైఖరి మారాలని సూచించారు.ఐటీ, ఈడీ, సీబీఐలతో బీజేపీ యేతర నాయకులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే అభివృద్ధి చేసి చూపించాలని, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news