వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచి జరుగుతుంది. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తుని ఫాలో అవ్వడం వలన ఇంట్లో ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ని పాతే అప్పుడు మరియు ఇంట్లో పెంచుతున్నప్పుడు ఈ తప్పులు అసలు చేయకూడదని వాస్తు పండితులు అంటున్నారు.
మరి మనీ ప్లాంట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి తప్పులను చేయకూడదు అనే ముఖ్యమైన విషయాలని ఇప్పుడు మనం చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ని పెంచేటప్పుడు కచ్చితంగా కొన్ని చిట్కాలను అనుసరించాలి లేదంటే అనవసరంగా ఆర్థిక నష్టం కలుగుతుంది.
ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోకూడదు. పసుపు రంగులోకి మారిపోకూడదు అలా ఆకుల్ని వదిలేయడం తప్పు. ఎండిపోయిన ఆకులని తొలగించాలి లేదంటే నష్టాలు కలుగుతాయి. అలానే మనీ ప్లాంట్ ఎప్పుడు ఇంటి బయట ఉండకూడదు ఇంటి లోపల మాత్రమే ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి.
అలానే మనీ ప్లాంట్ ని ఎప్పుడు కూడా ఈశాన్య వైపు నాటాలి. ఇలా ఈశాన్యం వైపు మనీ ప్లాంట్ ని నాటడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి సమస్యలు కలగకుండా ఉండాలంటే తప్పక వీటిని ఆచరించండి.