విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి అధికారులు విజయవాడ గుణదల లోని నివాసంతో పాటు పలుచోట్ల తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 5 టీములు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.
మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఐటి సోదాలకు కారణాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు హైదరాబాద్ లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ బిల్డర్ ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. వంశీ రామ్ బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. వంశీ రామ్ బిల్డర్ సుబ్బారెడ్డి బావమరిది జనార్ధన్ రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. మొత్తం 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.