పుష్ప-2 చిత్రంలో క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఇదే..!!

-

పుష్ప ది రైజ్ సినిమా విడుదలై ఇప్పటికీ ఏడాది కావస్తోంది. ఆ సమయంలో ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి చిత్ర బృందమే ఆశ్చర్యపోయారు. దీంతో ఎట్టకేలకు పార్ట్ 2 విషయంలో మొదట అనుకున్న కథకి పలు మార్పులు కూడా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ప్రేక్షకుల అంచనాను ఏమాత్రం తగ్గకుండా పుష్ప -2 ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ తెలియజేశారు. ఈ సినిమా కోసం సుకుమార్ పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమా టేకింగ్ విషయంలో కూడా కొత్తగా ఉండే విధంగా సుకుమార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇతరులను క్లైమాక్స్ కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పుష్ప -2 ది రూల్ సినిమాలో క్లైమాక్స్లో రామ్ చరణ్ ని పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఒకే సినిమాలో ఎంతోమంది స్టార్స్ సైతం నటిస్తూ ఉన్నారు. మరి కొంతమంది డైరెక్టర్లు సైతం హాలీవుడ్ రేంజ్ లో తమ సినిమాలు ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇదే తరహాలో డైరెక్టర్ సుకుమార్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

క్లైమాక్స్లో రామ్ చరణ్ పుష్ప తో కలిసి ఒక బిగ్ ఫైట్ ని ప్లాన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా హైలైట్ గా మారబోతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతుంది. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలుబడుతుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news