Breaking : అర్థరాత్రి షర్మిల దీక్ష భగ్నం చేసిన పోలీసులు..

-

తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రెండు రోజులుగా వైఎస్ షర్మిల చేస్తున్న ఆమరణ దీక్షను గత అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. గత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో లోటస్ పాండ్‌కు చేరుకున్న పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని అంతకుముందు షర్మిల తేల్చి చెప్పారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు.

Telangana police arrests YSRTP chief YS Sharmila, shifts her to private  hospital | India News

శుక్రవారం తమ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు శనివారానికి కూడా విడుదల చేయలేదని, పాత కేసులు తవ్వి వారిని రిమాండ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తన పాదయాత్రలో ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యాలయం చుట్టూ కర్ఫ్యూ ఎత్తివేసి, అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేసే వరకు దీక్షను ఆపబోనని స్పష్టం చేశారు. కాగా, షర్మిలకు మద్దతుగా ఆమె తల్లి విజయ లక్ష్మి కూడా దీక్షలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news