ఈ సింపుల్ టిప్స్ తో.. క్రెడిట్ స్కోర్‌ని మెరుగుపరుచుకోండి..!

-

ఈ మధ్యన చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డ్స్ వలన చక్కటి లాభాలని మనం పొందొచ్చు. అయితే బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుండి లోన్ ని కానీ క్రెడిట్ కార్డు ని కానీ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ని అడుగుతారు. సిబిల్ స్కోర్ ని బట్టీ బ్యాంకు మీకు ఏ వడ్డీకి రుణం ఇస్తుంది అనేది ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. ఇక మనం క్రెడిట్ స్కోర్ ని ఎలా మెరుగుపరుచుకోవాలి..? ఎలాంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలని చూద్దాం.

క్రెడిట్ కార్డు వున్నవాళ్లు పరిమితిని జాగ్రత్తగా చూసుకోండి. లిమిట్ దాటి వాడకండి. క్రెడిట్ పరిమితిలో 30% కంటే ఎక్కువ రుణం తీసుకోకూడదు. సిబిల్ స్కోర్ బాగుండాలంటే సకాలంలో లోన్ ని కడుతూ ఉండాలి. క్రెడిట్ కార్డ్ పరిమితిని గమనించండి కూడా ముఖ్యం. అందులో 30 శాతానికి మించి ఖర్చు చేయరాదు.

అసురక్షిత లోన్స్ తీసుకోవడం వలన మీ సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. కొలేటరల్‌ను అందించడం వల్ల ఆర్థిక సంస్థలకు నమ్మకం వస్తుంది. అలానే ఎప్పుడు కూడా మీరు కార్డు ని ఎంపిక చెయ్యాలి. తెలీకుండా లోన్ ఏమైనా మంజూరు చేసారా అనేది చూడాలి. మోసపూరిత లావాదేవీలు జరగవచ్చు కాబట్టి చూసుకుంటూ ఉండడం మంచిది. ఏడాదికి ఓసారి ఏదైనా క్రెడిట్ బ్యూరో నుండి క్రెడిట్ నివేదికలను ఫ్రీ గా తీసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news