సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి ఈ ముగింపు సభను పెట్టుకున్నామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుని మొదలుపెట్టినప్పుడు కెసిఆర్ ఇది మనకు శ్రీరామరక్ష అన్నాడని.. ఇది ఒక మానవ అద్భుతం అన్న కేసీఆర్.. గత నాలుగు నెలలుగా అక్కడికి చీమను కూడా ఎందుకు పోనివ్వడం లేదని ప్రశ్నించారు.
మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల దగ్గర పోలీసు బూట్ల సప్పుడు తప్ప.. ఎవరిని పోనివ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రజల రక్తపు చుక్కల మీద లక్షల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు కడితే.. మొన్నటి వరదకి మోటర్లు మునిగిపోయాయి అన్నారు. హుజరాబాద్ లో 4000 వేల కోట్లు ఖర్చుపెట్టిన.. ప్రజలు తననే గెలిపించాలని చెప్పారు. కెసిఆర్ దృష్టి అంతా తన కుటుంబం మీదే ఉందని మండిపడ్డారు. కెసిఆర్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు ఈటెల రాజేందర్. బిఆర్ఎస్ పార్టీ భరతం పడతామని హెచ్చరించారు.