పవన్ బలమే..జగన్ గెలుపు.!

-

అదేంటి పవన్ బలంతో జగన్ గెలవడం ఏంటని అనుకోవచ్చు..అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ చెప్పుకునే ముందు గత ఎన్నికల గురించి మాట్లాడుకుంటే…గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అలా జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి బెనిఫిట్ జరిగింది. ఒకవేళ టీడీపీ-జనసేన కలిసి ఉంటే వైసీపీ గెలిచేది ఏమో గాని..వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చేవి కాదు. కనీసం 50 సీట్లలో ఓట్ల చీలిక ప్రభావం ఉంది.

కానీ ఈ సారి ఓట్లని చీలనివ్వను అని పవన్ అంటున్నారు..అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ దాదాపు రెడీ అయిపోయారు. అటు చంద్రబాబు సైతం పవన్‌తో పొత్తుకు రెడీగా ఉన్నారు. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీకి పెద్ద రిస్క్. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా చేయడమే వైసీపీ లక్ష్యం. అందుకే పవన్‌ని వైసీపీ నేతలు టార్గెట్ చేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని, చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడు అని, బాబుని సీఎం చేయడానికి కాపులని తాకట్టు పెడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.

అంటే ఇలా చేయడం వల్ల పవన్..టీడీపీకి దూరంగా ఉంటారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా ఓట్లు చీలి మళ్ళీ తమకు లబ్ది జరుగుతుందనే కాన్సెప్ట్ వైసీపీది. కానీ ఇప్పుడు పవన్ దాదాపు టీడీపీతో కలవడానికి రెడీ అయ్యారు. అయితే చివరి వరకు టీడీపీతో పవన్ కలవకుండా చేయడమే వైసీపీ టార్గెట్.

అందుకే ఇటీవల పవన్‌ని టార్గెట్ చేసి రాజకీయంగా జనసేన బలం పెరిగేలా చేస్తున్నారు. అలా చేస్తే జనసేన బలం ఉందని చెప్పి..పొత్తు ఉంటే సీఎం సీటు డిమాండ్ చేస్తారు. ఇప్పటికే జనసేన శ్రేణులు పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని అంటున్నారు. ఇందుకు టీడీపీ ఏ మాత్రం ఒప్పుకోదు. అలా సీఎం సీటు అనే చిచ్చు పెట్టి టీడీపీ-జనసేన పొత్తు లేకుండా చేసి..మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు చీలి దాని ద్వారా లబ్ది పొందాలని వైసీపీ చూస్తుంది. మరి వైసీపీ అనుకున్నది జరుగుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news