మూడు రోజుల్లోనే మూలన పడ్డ అవతార్ 2 వసూళ్ళు..!!

-

అవతార్ 2 సినిమా భారత్ లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నాలుగు వేలకు పైగా తెరలపై విడుడలైంది. ప్రస్తుతం మూడు రోజుల వరకూ వసూళ్లలో ఈ చిత్రం దూసుకొని పొయింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే సుమారు రూ. 3600 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారత్ లోనూ ఈ చిత్రంపై కలెక్షన్ల వర్షం  కురిసింది.

విచిత్రంగా తెలుగు రాష్ట్ర లలో అవతార్ ప్రభంజనం అంతగా కనపడటం లేదు. మరీ ముఖ్యంగా  సోమవారం నుంచి మాత్రం కలెక్షన్స్ డ్రాప్ మొదలయ్యినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం అందుతోంది. హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో మార్నింగ్ షోకు సుదర్శన్ 35 ఎంఎంలో పది వేలు కూడా రాలేదని అంటున్నారు. పక్కన దేవిలోనూ పదిహేను వేలకు మించి రాలేదని తెలుస్తోంది.

ఈ సినిమా మీద ఉన్న హైప్ తో అస్సలు వారం పాటు టిక్కెట్లు దొరకవని అనుకున్నారు. కాని పర్లేదు అన్న విధంగా వీకెండ్ టికెట్లు దొరకని అవతార్ ది వే అఫ్ వాటర్ వీకెండ్ అయ్యాక దారుణ మైన పరిస్థితి ఎదుర్కొంది. మామూలుగా ఏ సినిమాకైనా సోమవారం ఈ తరహా పరిస్థితి ఎదురవుతుంది. మంచి హీరోల, దర్శకుల సినిమాలు మాత్రం  యాభై శాతానికి పైగానే ఆక్యుపెన్సీ వస్తుంది. కానీ అవతార్ మాత్రం మూడు రోజుల్లోనే మూలన పడింది అంటున్నారు. దీనికి లీకేజీ తో పాటు జనాలు ఓ టి టి కు అలవాటు పడటం వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news