ఫ్యాక్ట్ చెక్: జనవరి 1 నుంచి రూ.2 వేల నోట్లుని బ్యాన్ చేస్తున్నారా..? నిజమేనా..?

-

ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు ఎక్కువైపోతున్నాయి. సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. చాలా మంది నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ వార్త వచ్చింది. అది నిజమా కాదా అనేది మనం చూద్దాం. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి 2 వేల రూపాయల నోట్లు చెల్లవని.. వాటిని బ్యాన్ చేస్తున్నారని వార్త వచ్చింది. మరి నిజంగా రెండు వేల రూపాయిల నోట్లు చెల్లవా…? ఇది నిజమేనా అనేది చూస్తే.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జనవరి 1 నుంచి 2 వేల రూపాయల నోట్లు బ్యాన్ చేస్తుందని వస్తున్నది కేవలం నకిలీ వార్త మాత్రమే.

నిజం కాదు. సోషల్‌ మీడియాలో వస్తున్నా ఈ వార్త వట్టి ఫేక్ వార్త మాత్రమే. ఇదేమి నిజం కాదు. కనుక అనవసరంగా ఇలాంటి నకిలీ వార్తలని నమ్మద్దు. నకిలీ వార్తలని ఇతరులకి కూడా షేర్ చెయ్యద్దు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఇది నకిలీ వార్త అని చెప్పేసింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news