కరోనా కొత్త వేరియంట్ పై లోక్ సభ లో కేంద్ర ఆరోగ్య మంత్రి మనసుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. కొత్త వేరియంట్ బిఎఫ్ – 7 పై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జినోమ్ సీక్వెన్సింగ్ పెంచాలన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించేలా చూడాలన్నారు. త్వరలో వరుస పండుగలు ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలి.. శానిటైజర్లు వాడాలన్నారు. అలాగే సామాజిక దూరాన్ని కూడా పాటించాలన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.