మీ పిల్లలు హైట్ అవ్వాలా..? అయితే కచ్చితంగా ఈ ఆహారం పెట్టండి..!

-

పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి తల్లిదండ్రులు వివిధ రకాల చిట్కాలని ఫాలో అవుతూ ఉంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలని వాళ్ళకి పెట్టాలి అలానే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు బాగా హైట్ అవ్వాలని చూస్తూ ఉంటారు. మీ పిల్లలు కూడా హైట్ గా అవ్వాలని మీరు అనుకుంటున్నారా అయితే కచ్చితంగా డైట్ లో వీటిని చేర్చండి అప్పుడు కచ్చితంగా పిల్లలు హైట్ అవుతారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు వ్యాయామం ముఖ్యం అలానే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.

పోషక పదార్థాలు ఇవ్వండి

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా డెవలప్మెంట్ ఉండాలన్నా క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి ఇటువంటివన్నీ కూడా వాళ్ళ డైట్ లో ఉండేటట్టు చూడండి.

ఆకుకూరలు

ఆకుకూరలు పిల్లలు హైట్ ఎదగడానికి హెల్ప్ అవుతాయి. కాలే, తోటకూర, పాలకూర ఇటువంటివన్నీ కూడా పిల్లలకి పెట్టండి.

బ్రోకలీ

బ్రోకలీ ని కూడా పిల్లలకి పెట్టండి. బ్రోకలీ ని పిల్లలు తీసుకోవడం వలన మెదడు ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళు హైట్ ఎదగడానికి కూడా అవుతుంది.

బీన్స్

బీన్స్ లో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. బీన్స్ ని కూడా పిల్లలకి ఇవ్వండి ఇది కూడా హైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది.

గుడ్లు

గుడ్లలో ప్రోటీన్, కొలిన్ వంటివి ఉంటాయి ఇందులో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ పిల్లలు ఎదుగుదలకి తోడ్పడతాయి.

పాలు

ప్రతిరోజు పిల్లలకి పాలని కూడా ఇవ్వండి ఇందులో ఉండే క్యాల్షియం ముఖ్యమైన పోషక పదార్థాలు వారి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.

క్యారెట్

క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది అలానే క్యారెట్ లో ఇతర పోషక పదార్థాలు కూడా ఉంటాయి క్యారెట్ ని పిల్లలకి ఇవ్వడం వలన వారు ఎదుగుదల బాగుంటుంది. యోగర్ట్, చికెన్, సాల్మన్, బాదం బెర్రీస్ ని కూడా పిల్లలకి ఇవ్వండి వీటిని పిల్లలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది హైట్ కూడా బాగా ఎదుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news