కైకాల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.పలువురు సినీ ప్రముఖులు అయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే దిగ్గజాలు కృష్ణంరాజు, కృష్ణ మరణంతో మొదటి తరాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయింది. వారికి సరి జోడీగా ఎక్కడా తగ్గకుండా నటించిన కైకాల సత్యనారాయణ మరణం వెల కట్టలేనిది.
కైకాల తన ఫిల్మ్ కెరీర్ లో దాదాపు గా 200 మంది దర్శకులతో పనిచేశారు. అలాగా 50కి పైగా హీరోలతో నటించారు. తన కుటుంబం నుంచి ఒక్కరినైనా ఇండస్ట్రీలో తన వారసుడిగా పరిచయంచేయాలి అనుకున్నారు కైకాల. కాని ఆయన ఆశ తీరలేదు.. కైకాల కుటుంబం నుంచి ఎవరూ వారసులు గా రాలేదు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుతో కలిసి కైకాల సత్యనారాయణ ఎన్నో సినిమాలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ లాంటి అగ్ర హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటించారు. సుధీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో పాత్రల్లో ఆయన నటించారు. దుర్యోధనుడు, ఘటోత్కచుడు, యమధర్మరాజు, దుశ్శాసనుడు, భరతుడు, కర్ణుడు, రావణాసురుడి పాత్రల్లో మెప్పించారు. చాలా మంది సత్యనారాయణ ను చూసి ఎన్టీఆర్ గా భావించే వారు. అంతటి ఆజానుబాహుడు గా ఉండే వారు కైకాల. పురాణ పాత్రలు ఎన్టీఆర్ తర్వాత కైకాల కే ఎక్కువ సెట్ ఆయ్యేవి.