తిరుపతిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజకీయం..అసలు టార్గెట్ ఏంటి..!

-

ఇటీవలే హైదరాబాద్‌లో మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజకీయం ఇప్పుడు తిరుపతికి షిఫ్ట్ అయింది. ఏదో తిరుపతికి వెళ్లాలని అనుకుంటే ఒకరిద్దరు అనుకుని ఉంటారు..కానీ మొన్న కలిసిన ఎమ్మెల్యేలు కలిసి తిరుపతికి వెళ్లారు. ఆ ఐదుగురితో పాటు మరో ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కలిశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సైతం..ఆ అయిదుగురితో పాటు తిరుపతికి వెళ్లారు.

 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్నారని, ఆయనకు కావలసిన వాళ్ళకే పదవులు ఇప్పించుకుంటున్నారని చెప్పి..మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు సెపరేట్ గా సమావేశమై..మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇక తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, తాను గాంధేయవాదినని, అవసరమైతే ఎమ్మెల్యేలతో మాట్లాడతానని మల్లారెడ్డి చెప్పారు. కుటుంబ సమస్యని పెద్దది చేయవద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. అయితే ఆ ఎమ్మెల్యేలు సమస్యని పెద్దగానే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు వారు మాత్రం కలిసి తిరుపతికి వెళ్ళడం హాట్ టాపిక్ అయింది. వారితో పాటు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా కలిశారు.

హైదరాబాద్ నుంచే వారంతా కలిసి వెళ్ళినట్లు తెలిసింది. అలాగే తిరుమల శ్రీవారిని దర్శించుకుని అక్కడే భేటీ అయినట్లు సమాచారం. అయితే వీరు ఎందుకు సెపరేట్ గా భేతీ అవుతున్నారు. ఏమైనా సమస్య ఉంటే కేసీఆర్‌ని మాట్లాడవచ్చు..కానీ అది మాత్రం చేయట్లేదు. వీరు ఏమైనా రాజకీయంగా ఎత్తులు వేస్తున్నారా? లేక మంత్రి మల్లారెడ్డిని పక్కకు తప్పించడానికి ఈ విధమైన రాజకీయం చేస్తున్నారా? అనేది క్లారిటీ లేదు. మరి చూడాలి ఈ అసంతృప్తి ఎమ్మెల్యేల టార్గెట్ ఏంటో?

Read more RELATED
Recommended to you

Latest news