బీజేపీలో కేసీఆర్ కోవర్టు..ఆ ఎమ్మెల్యే టార్గెట్‌గా!

-

తెలంగాణ రాజకీయాల్లో కోవర్టుల హవా పెరిగిపోయింది..ఒక పార్టీలో ఉంటూ..మరొక పార్టీకు మేలు చేసే నేతలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కోవర్టు రాజకీయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఈ కోవర్టు రాజకీయం తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ లో కొందరు నేతలు కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

అందుకే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో బీజేపీకి అనుకూలంగా పనిచేసే కోవర్టులు ఉన్నారనే ప్రచారం ఉంది. ఇక తాజాగా బీజేపీలో కూడా కేసీఆర్ కోవర్టులు ఉన్నారని సంచలన ఆరోపనలు బయటకొచ్చాయి. అది కూడా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు టార్గెట్ గా కొందరు కమలం సీనియర్లు ఆరోపనలు చేస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించి బీజేపీ తరుపున గెలిచిన రఘునందన్ బీజేపీ పార్టీలో దూకుడుగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే.

 

అయితే రఘునందన్..దుబ్బాకలో కొందరు బీజేపీ సీనియర్లని పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా దుబ్బాకలో కొందరు సీనియర్లు రఘునందన్‌కు వ్యతిరేకంగా రహస్యంగా సమావేశమైనట్లు తెలిసింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చేందుకు నేతలు భేటీ అయ్యారని తెలుస్తోంది.

పైగా తమకు పార్టీలో గౌరవడం లేదని, రఘునందన్..కేసీఆర్‌కు కోవర్టుగా పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అసలు రఘునందన్..బీఆర్ఎస్ పార్టీ నేతలతో గట్టిగానే పోరాడుతున్నారు. ఇటీవల ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో తెలిసిందే. అయితే ఇప్పుడు సొంత పార్టీ వాళ్లే రఘునందన్‌కు వ్యతిరేకంగా తయారయ్యారు. దీని వల్ల కమలం పార్టీకి కొత్త తలనొప్పి పెరిగిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news