బండి సంజయ్ అరెస్ట్ పై విజయశాంతి సీరియస్.. ఇదే మీ ఖర్మ అంటూ !

-

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ రద్దు… ఇండస్ట్రియల్‌, గ్రీన్‌ జోన్‌ల తొలగింపు కోసం డిమాండ్‌ చేస్తూ, ఇండస్ట్రియల్ జోన్‌తో మనస్థాపానికి గురై రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంపై బాధిత గ్రామాల కర్షకులు కదం తొక్కారని విజయశాంతి పేర్కొన్నారు.

 

తమ జీవనాధారమైన పంట పొలాల్లో మాస్టర్‌ప్లాన్‌ల పేరుతో ఇండస్ట్రియల్‌ జోన్‌లు ఏర్పాటు చేస్తూ ఆ భూములకు ధర రాకుండా చేస్తున్నరని, రెండు పంటలు పండించుకోకుండా తమ పొట్టకొడుతున్నరంటూ అడ్లూర్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి, టెక్రియాల్‌, ఇల్చిపూర్‌, లింగాపూర్‌ గ్రామాలకు చెందిన రైతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం భారీ ర్యాలీ తీశారన్నారు.

 

రాములుకు నివాళ్లు అర్పించి కలెక్టరేట్‌ వరకు 3వేల మంది రైతులతో భారీ ఎత్తున ర్యాలీగా కలెక్టరేట్‌ కార్యాలయానికి తరలివెళ్లి 3 గంటల పాటు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. మాస్టర్‌ ప్లాన్ రద్దు, ఇండస్ట్రియల్‌ జోన్‌ తొలగింపుపై జిల్లా కలెక్టర్‌ కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ బయటకు వచ్చి ప్రకటన చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారనీ తెలిపారు.

 

ఆవేదనలో ఉన్న రైతులను కామారెడ్డి ఏఎస్‌పీ, డీఎస్‌పీ బెదిరించే ప్రయత్నం చేశారు.అన్యాయానికి గురైన రైతన్నలకు అండగా నిలిచేందుకు వచ్చిన మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారిని సైతం అరెస్ట్ చేశారు. ధర్మ పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారిపై దుర్మార్గ దమనకాండకు పాల్పడ్డ ప్రతిసారీ కేసీఆర్ గారి నియంతృత్వ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వచ్చి తీరతాయన్నది చరిత్ర తిరిగి తిరిగి చెబుతున్న సత్యం. ఐనా మారకపోవడం బీఆరెస్ ఖర్మం అని ఆగ్రహించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news