మంత్రి రోజా పరువు తీసిన గెటప్ శీను..అదే రీజనా?

-

గెటప్ శీను గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. తన నటనతో బుల్లి తెర కమెడియన్ గా పాపులర్ అయ్యాడు.. జబర్దస్త్ షో ద్వారా బుల్లి తెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్నాడు…ఇక జబర్దస్త్ మొదట్లో జడ్జిలు నాగబాబు, రోజాలకు శీను అంటే ఇష్టం. సినిమాల్లో కూడా పాత్రలు వేస్తున్న శ్రీను.. త్వరలో రాజు యాదవ్ తో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అయితే తాజాగా శ్రీను ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. మంత్రి రోజాను డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అయిన ఈ నటుడు.. మెగా కుటుంబానికి విధేయుడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఈ క్రమంలోనే మంత్రి రోజా మెగా బ్రదర్స్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌పై కాస్త వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు. ‘చిరంజీవి గారి .. సేవా గుణ , దాన గుణం తెరిచిన పుస్తకం .. ఒక స్ఫూర్తి. మరి మీకెందుకు కనపడలేదో ,?రోజగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం .. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీమీదున్న గౌరవాన్ని కోల్పోకండి .. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి ‘ అంటూ తన ఫేస్ బుక్‌లో రాసుకొచ్చాడు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది..గెటప్ శ్రీనుకి ఇంతలా కోపం రావడం రాజాకీయ చర్చలకు దారి తీసింది.. గెటప్ శ్రీను చేసిన పోస్ట్‌పై వైసీపీ అభిమానులు మాత్రం భగ్గుమంటున్నారు. అటు మెగా ఫ్యాన్స్ శ్రీనుకు తోడుగా నిలబడ్డారు.ఇది ఇప్పుడు ఫ్యాన్స్ వర్సెస్ పాలిటిక్స్ అయింది..ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news