Breaking : తెలంగాణ వాసులకు అలర్ట్‌.. నేడు కంటి వెలుగు ప్రారంభం

-

ప్రభుత్వాలు చేపట్టే కొన్ని రకాల పథకాలు ప్రజలకు బాగా మేలు చేస్తాయి. వాటిలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కంటివెలుగు పథకం ఒకటి. మన ఇళ్లలో చాలా మంది పెద్దవాళ్లు.. తమకు కంటి సమస్యలు ఉన్నా, చూపు తగ్గినా… ఆ విషయం బయటకు చెప్పరు. డాక్టర్ దగ్గరకు వెళ్తే డబ్బు ఖర్చవుతుందని.. రాజీ పడిపోతారు. అలాంటి వాళ్లకు ఈ కంటి వెలుగు పథకం ఉచితంగా కళ్లద్దాలు ఇస్తోంది. ఉచితంగా కళ్ల సమస్యల్ని పరిష్కరిస్తోంది. ఇవాళ రెండో విడత ప్రారంభం కానుంది. తొలిరోజు మొత్తం 50 మందికి కంటి పరీక్షలు చేయనున్నారు. ఇందులో తొలి ఆరుగురికి కంటి పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్‌, ఐదుగురు ముఖ్య అతిథులతో కలిసి కంటి అద్దాలు అందజేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు కొనసాగుతాయి. బుధవారం నుంచి నిర్దేశిత గ్రామాలు, పట్టణాల్లో క్యాంపులు ప్రారంభం అవుతాయి. అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు, మందులు అందజేస్తారు. ఆపరేషన్‌ అవసరం ఉన్నవారికి శస్త్రచికిత్స రెఫర్‌ చేయిస్తారు.

 

కంటి పరీక్షలకు వచ్చేవారు ఆధార్‌ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలి. అక్కడ సిబ్బంది వారి పేరు, ఫోన్‌ నంబర్‌, ఆధార్‌, చిరునామాలాంటి సమగ్ర వివరాలను సేకరిస్తారు. శిబిరంలో మొత్తం ఆరు దశల్లో పరీక్ష జరుగుతుంది. ప్రక్రియ మొత్తం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిర్వహిస్తారు. బాధితుల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉంటాయి. ఈ డేటా ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ప్రజల కంటి ఆరోగ్యంపై పర్యవేక్షణకు అవకాశం కలుగుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news