Breaking : నేడు ఎన్టీఆర్‌ 27వ వర్ధంతి .. నివాళులు అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌

-

వెండితెరపై అందాల రాముడైనా … కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్న మహానటుడు ఎన్టీఆర్ వర్ధంతి నేడు. తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ఢిల్లీ స్థాయిలో తెలుగు వారి సత్తా చూపించిన మాజీ సీఎం ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా.. ఆయన కుటుంబ సభ్యులు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ తదితరులు.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. తాత ఎన్టీఆర్‌ను తలచుకుని జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు వారి కోసం ఎన్టీఆర్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు.

ntr

ఈ సందర్భంగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. సీఎం ఎన్టీఆర్ అని నినాదాలు చేశారు. ఇది ఎన్టీఆర్‌కి ఒకింత ఇబ్బంది కలిగించింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి… నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమాల్లో కార్యకర్తు, అభిమానులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ నేతలు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news