స్మితా సబర్వాల్ ఇంట్లో ఓ అధికారి చొరబడ్డ సంఘటనపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ పాలనలో మినిమమ్ గవర్నెన్స్ మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ఫలితం ఇది…సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిబిడ్డకే కాదు… ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే మహిళా ఉన్నతాధికారిణికీ భద్రత లేని పాలనలో ఉన్నామని ఫైర్ అయ్యారు.
ఆడబిడ్డలూ… తస్మాత్ జాగ్రత్త ! అని రేవంత్ రెడ్డి కోరారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం లో క్షీణించిన శాంతి భద్రతల కి అద్దం పడతాయని..సీఎం కార్యదర్శి ప్రాణాలకె రక్షణ లేదు అంటే కేసీఆర్ ఎవరిని కాపాడుతారని నిలదీశారు రేవంత్ రెడ్డి. ఇంటికి తాళాలు వేసుకొని లోపల భయం భయంగా బతకండని స్మిత సబర్వాల్ అనడం రాష్ట్రంలో మహిళలకు భద్రత లేక పోవడానికి నిదర్శన మన్నారు. స్మితా సబర్వాల్ ఏమో 100 డయల్ చేయండి అంటుంది..కేసీఆర్ ఎమో 100 పేపర్స్ అంటున్నారని ఆగ్రహించారు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
కేసీఆర్ పాలనలో మినిమమ్ గవర్నెన్స్ మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ఫలితం ఇది.
సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిబిడ్డకే కాదు… ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే మహిళా ఉన్నతాధికారిణికీ భద్రత లేని పాలనలో ఉన్నాం.
ఆడబిడ్డలూ… తస్మాత్ జాగ్రత్త!@TelanganaCMO @hydcitypolice @TelanganaDGP https://t.co/UjrESVzb7G
— Revanth Reddy (@revanth_anumula) January 22, 2023