త్వరలో విజయవాడలో మైనారిటీ సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష. సజ్జల అధ్యక్షతన ఈ సమావేశం జరిగనుందని..భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం ఏ రకంగా కృషి చేయాలి అని చర్చించామని తెలిపారు.
గతంలో ఏ ప్రభుత్వమూ చేయునట్లు జగన్ మైనారిటీల కోసం కృషి చేశారని..20 వేల కోట్లు మైనారిటీల కోసం ఖర్చు చేశారని గుర్తు చేశారు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష. ఈ విషయాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని వెల్లడించారు. మైనారిటీల కార్యకర్తలు సమాయత్తం కావాలని.. అతి త్వరలో విజయవాడలో మైనారిటీ సదస్సు ఉంటుందన్నారు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష.