అసెంబ్లీ బరిలో కొండా-వివేక్-జితేందర్..కారుకు చెక్ పెట్టే వ్యూహం.!

-

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై గెలవడం కోసం బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళుతుంది. తొలిసారి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడానికి ఆసక్తిగా ఉంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా తెలంగాణ బి‌జే‌పి నేతలు ఫైట్ చేస్తున్నారు. కే‌సి‌ఆర్ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఎలాగైనా కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు.

Vivek Venkataswamy: ఇది కేసీఆర్‌ విజయం కాదు.. వచ్చే ఎన్నికల్లో 65 – 70 సీట్లు మావే..! - NTV Telugu

అటు ఢిల్లీ పెద్దలు సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. వరుసపెట్టి తెలంగాణ పర్యటనలకు వస్తున్నారు. మోదీ, అమిత్ షా, జే‌పి నడ్డాలు వరుసపెట్టి తెలంగాణలో పర్యటిస్తున్నారు. పలు రకాల వ్యూహాలని రాష్ట్ర నేతలకు చెప్పి..ఆ దిశగా పనిచేసేలా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రతి స్థానంలో బి‌జే‌పి బలపడేలా బూత్ లెవెల్ కార్యకర్తలని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని సైతం లాగడానికి చూస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం పార్లమెంట్ స్థాయి నాయకులని అసెంబ్లీ స్థానాల్లో దింపడానికి చూస్తున్నారు.

 

ఎలాగో పార్లమెంట్ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలు ముందు జరగనున్నాయి. కాబట్టి ఇప్పుడు బి‌జే‌పిలో ఎంపీలుగా ఉన్న నలుగురుని అసెంబ్లీ స్థానాల్లో దిగడానికి రెడీ అయ్యారు. కిషన్ రెడ్డి, బాపురావు, బండి సంజయ్‌లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం గ్యారెంటీ. ధర్మపురి అరవింద్ పోటీ పై క్లారిటీ రాలేదు. ఇటు రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ సైతం అసెంబ్లీ బరిలో ఉంటారు.

ఇదే సమయంలో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్, జితేందర్ రెడ్డిలు సైతం అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారని తెలుస్తోంది. బలమైన నాయకులు అసెంబ్లీ స్థానాల్లో దిగితే బి‌జే‌పికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇంకా ఈ మాజీ ఎంపీలు పోటీ చేసే సీట్లపై క్లారిటీ రాలేదు గాని..ఖచ్చితంగా వారు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news