సజ్జలపై కోటంరెడ్డి ఫైర్.. త్వరలోనే పదవి ఊడుతుందంటూ..

-

వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కోటంరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అని లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఏ నిమిషమైనా తనను అరెస్టు చేసుకోండని సవాల్ చేశారు. కావాలంటే శాశ్వతంగా జైల్లో పెట్టండని అన్నారు. కేసులు పెట్టి అలసిపోవాలే తప్ప.. తన గొంత ఆగే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. ‘నా గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారం.. ఎన్‌కౌంటర్‌ చేయించండి. ఎన్‌కౌంటర్‌ చేయిస్తే నా గొంతు ఆగుతుంది.’ అని కోటంరెడ్డి అన్నారు.

‘నిన్న అందరు వైసీపీ నాయకులకు ఏదో ఆడియో పంపించారు. నాకు తెలుసు ఆ ఆడియో పంపింది సజ్జలేనని. సజ్జల గారూ.. ఈ ఆడియోలు పంపితే లాభం ఏం ఉండదు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితేంటి..? ఇసుక బకాసులను ఎలా అడ్డుకోవాలి..? సురాసులను ఎలా నిలువరించాలి..? ఇలాంటి వాటిపై ఆడియోలు పంపండి. నాయకుల్లో ఉత్సాహం కలిగించండి. కానీ మీరు అలా చేయరు. చేస్తే మీ పదవి ఊడటం ఖాయం.’ అని కోటంరెడ్డి అన్నారు. చివరగా.. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుందని కోటం రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news