టర్కీ, సిరియాల్లో భూకంపం.. 3,400కు పైగా చేరిన మరణాలు

-

వరుస భూకంపాలు టర్కీ, సిరియాలను వణికించాయి. 24 గంటల్లోనే మూడుసార్లు భూకంపం సంభవించడంతో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న టర్కీ, సిరియాల్లో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి.

ఈ భూకంపాల ధాటికి రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు 3400కు పైగా మరణించారని అధికారులు తెలిపారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. రిక్టర్ స్కేల్ పై తొలుత 7.8 తీవ్రతతో ప్రకంపనలు రాగా.. 15 నిమిషాల వ్యవధిలో మరోసారి 6.7తీవ్రతతో భూమి కంపించినట్లు యూఎస్​ జియోగ్రాఫికల్ సర్వీస్ పేర్కొంది.

భూకంపం తర్వాత దాదాపు 42సార్లు భూమి కంపించినట్లు తుర్కియే విపత్తు, అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణ తుర్కియేలోని కహ్రాన్మరస్​ ప్రావిన్స్​లో రిక్టర్​ స్కేల్​పై 7.6 భూకంప తీవ్రత నమోదైంది. మూడోసారి 6.0 శాతం రికార్డైంది. విపత్తు నిర్వహణ సిబ్బంది, సహాయక సిబ్బంది.. భవనాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news