మరో రెండు వందేభారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించిన మోదీ

-

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ స్టేషన్ లో మరో రెండు వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికే పలు మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టిన కేంద్రం… తాజాగా మరో రెండు వందేభారత్ రైళ్లను ముంబయి నుంచి ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ స్టేషన్ లో ఈ రైళ్లను ప్రారంభించారు. వీటిలో ఒకటి ముంబయి-షిర్డీ, మరొకటి ముంబయి-షోలాపూర్ మార్గాల్లో ప్రయాణించనున్నాయి.

Mumbai: PM Modi flags off 2 Vande Bharat trains, inaugurates slew of other  projects | LIVE | Pm News – India TV

వీటిని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ… దేశాభివృద్ధి వేగాన్ని వందేభారత్ రైలు ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఆధునిక భారతదేశానికి ఇదొక ఘనతర నిదర్శనం అని పేర్కొన్నారు. కాగా, నేడు ప్రారంభోత్సవం జరుపుకున్న రెండు రైళ్లతో కలిపి దేశంలో ఇప్పటివరకు తిరుగుతున్న వందేభారత్ రైళ్ల సంఖ్య 10కి పెరిగింది. కాగా, గతంలో ప్రారంభోత్సవం జరుపుకున్న 8 వందేభారత్ రైళ్లు అంతర్రాష్ట్ర రైళ్లు కాగా, నేడు ప్రారంభించిన వందేభారత్ రైళ్లు ఒకే రాష్ట్రం (మహారాష్ట్ర)లో తిరగనున్నాయని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news