అలా కూడా నటించడానికి సిద్ధం అంటున్న స్టార్ హీరోయిన్..!

-

టాలీవుడ్ లో హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమలో కొత్త మేకోవర్ చేసుకుంటూ ఒకవైపు సంపాదన.. మరొకవైపు పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నెపంతో ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేస్తూ.. డబ్బుల కోసం ఎలాంటి పని చేయడానికి అయినా వెనుకాడడం లేదు.. ముఖ్యంగా అలాంటి వారిలో ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ ఈకోవకు చెందిన వారే అని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే ఈమె ఇప్పటికే తండ్రి కొడుకులతో కూడా కలసి నటించింది.

ఇప్పటివరకు ఆ హీరోయిన్ పై ఎటువంటి ప్రేమ, పెళ్లి, డేటింగ్ అంటూ ఎటువంటి వార్తలు పుట్టుకు రాలేదు. కానీ ఇదే ఏడాది కొత్తలో ఆమె ప్రేమలో ఉంది అంటూ రకరకాల రూమర్లను కూడా ఎదుర్కొంది. మూడు పదుల వయసు దాటినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటూ దాదాపు దశాబ్దానికి పైగా ఒకే రేంజిలో స్టేటస్ అనుభవిస్తుంది. ఆమె ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా .. ఆమె మిల్క్ బ్యూటీ తమన్నా.. ఇదిలా ఉండగా తమన్న కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది.

త్వరలోనే తమన్నా ఒక వెబ్ సిరీస్ లో న్యూడ్ గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. లాస్ట్ స్టోరీస్ అని సిరీస్ హిందీ వెర్షన్ లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కి పార్ట్ 2 తెరకెక్కబోతుంది.. పార్ట్ వన్ లో కియారా అద్వానీ స్వయంతృప్తి పొందే గృహిణిగా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆమె పాత్రలో తమన్నా నటించబోతుందని.. ఇందులో న్యూడ్ గా నటించడానికి ఒప్పుకుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news