ఏపీలో రాజకీయ రేసు హోరాహోరీగా నడుస్తోంది..అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య పోరు పోటాపోటిగా ఉంది. ఈ సారి ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవాలనే కసి రెండు పార్టీల్లో కనిపిస్తుంది. అలాగే జనం మద్ధతు పెంచుకునేందుకు రెండు పార్టీలు ప్రజల్లోనే ఉంటున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యేలు గపడగపడకు వెళుతున్నారు. మంత్రులు రాష్ట్రంలో రౌండప్ వేస్తున్నారు. ఇటు జగన్..ఏదొక ఓపెనింగ్ పేరుతో భారీ సభలతో జనంలో ఉంటున్నారు.
ఇటు టీడీపీ ఇంచార్జ్‌లు ఇంటింటికి తిరుగుతూ ప్రజా మద్ధతు పెంచుకునే దిశగా వెళుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అటు అధినేయత్ చంద్రబాబు ఓ వైపు నేతలకు దిశానిర్దేశం చేస్తూనే..మరోవైపు రోడ్ షోలతో జనంలో ఉంటున్నారు. ఇక నారా లోకేష్ పాదయాత్రతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఇలా రెండు పార్టీలు ప్రజల్లోనే ఉంటున్నాయి. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలోనే క్లారిటీ లేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతుంది.. అయినా సరే పవన్ ఏదో అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలతో బయటకొచ్చి మళ్ళీ సినిమా షూటింగ్‌ల్లో బిజీ అయిపోతున్నారు.
ఇక జనసేన నేతలు సైతం పూర్తి స్థాయిలో ప్రజల్లో తిరగడం లేదు. పైగా టీడీపీతో పొత్తు ఉంటే కొన్ని సీట్లు వస్తాయి కాబట్టి..అన్నీ సీట్లలో పనిచేయాల్సిన అవసరం లేదనే భావనలో జనసేన నేతలు ఉన్నట్లు కనిపిస్తున్నారు. పరిస్తితి ఇలాగే కొనసాగితే జనసేన బలం పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
ఇకనైనా పవన్ పూర్తి స్థాయిలో ప్రజా క్షేత్రంలోకి దిగాలి. అప్పుడే జనసేనకు బలం పెరుగుతుంది. వారాహి బస్సు యాత్ర ఉందని చెప్పారు గాని..ఇంకా అది మొదలు కాలేదు. ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. ఇంకా షెడ్యూల్ కూడా రాలేదు. కానీ ఏదేమైనా పవన్ త్వరగా ప్రజల్లో తిరిగితేనే జనసేన పికప్ అవుతుంది..లేదంటే అంతే సంగతులు.