తెలుగుదేశం పార్టీ టార్గెట్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఇద్దరు నేతలు టిడిపిలో రాజకీయ జీవితం మొదలుపెట్టి..టిడిపిలో రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి..అది కూడా టిడిపి కంచుకోటలుగా ఉన్న గుడివాడ, గన్నవరంల్లో గెలిచి..వైసీపీలోకి జంప్ చేసి..చంద్రబాబు, లోకేష్లని ఏ స్థాయిలో బూతులు తిడుతున్నారో తెలిసిందే..అందుకే ఆ ఇద్దరి టార్గెట్ గా టిడిపి పనిచేస్తుంది..నెక్స్ట్ ఎన్నికల్లో వారిని ఎలాగైనా ఓడించాలని చూస్తుంది.
అయితే టిడిపి ఎంత టార్గెట్ చేస్తే అంత ఎక్కువగా ఆ ఇద్దరు నేతలు..టిడిపికి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా గన్నవరంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. వంశీని విమర్శించారని చెప్పి..ఆయన అనుచరులు టిడిపి నేత ఇంటిపై, టిడిపి ఆఫీసుపై దాడి చేశారు. అటు రోడ్డుపై టిడిపి, వంశీ అనుచరుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో టిడిపి నేత పట్టాభితో పాటు పలువురు కీలక టిడిపి నేతలని పోలీసులు అరెస్ట్ చేశారు. అదేంటి దాడులు చేసింది వంశీ అనుచరులైతే టిడిపి నేతలపై కేసులు పెట్టడంపై టిడిపి రగిలిపోతుంది. గన్నవరంలో సరైన నేత లేక వంశీ చెలరేగిపోతున్నారని, ఆయనని ఓడించడానికి బలమైన నాయకుడుని బరిలో దింపాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి.
వంశీ టిడిపిలో గెలిచి, వైసీపీలోకి వెళ్ళాక..అక్కడ టిడిపిలో బలమైన నేత లేరు. బచ్చుల అర్జునుడుని ఇంచార్జ్ గా పెట్టిన ఆయన ఎఫెక్టివ్ గా పనిచేయలేదు. పైగా ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. దీంతో అక్కడ బలమైన నాయకుడుని పెట్టాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి. అది కూడా వంశీకి చెక్ పెట్టేలా కమ్మ వర్గానికి చెందిన నేతని బరిలో దింపాలని అంటున్నారు.
మరి ఈ అంశంపై చంద్రబాబు ఆలోచన చేస్తారో లేదో క్లారిటీ లేదు. కానీ గన్నవరంలో బలమైన నాయకుడుని పెడితేనే వంశీని నిలువరించడం సాధ్యం అవుతుంది..లేదంటే వంశీని కదిలించడం ఎవరి తరం కాదు.