తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ను JNTUH విడుదల చేసింది. మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ పరీక్ష మే 7, 8, 9 తేదీల్లో, అగ్రికల్చర్-మెడికల్ పరీక్ష మే 10, 11 తేదీల్లో జరగనున్నాయి. ఏదైనా ఒక పరీక్షకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500, మిగతావారు రూ.900 చెల్లించాలి. రెండు పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.1000, మిగతావారు రూ.1800 చెల్లించాలి.
అటు… తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ. మార్చి 1న లాసెట్, పీజీ లాసెట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 600గా దరఖాస్తు ఫీజు నిర్ధారించారు. రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 12 వరకు, రూ. 1000తో ఏప్రిల్ 19 వరకు, రూ. 2000తో ఏప్రిల్ 26 వరకు, రూ. 4వేలతో మే 3వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 5 నుంచి 10వ తేదీ వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.