రేవంత్ రెడ్డిపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ‘మహానేత YSR పాలన తెస్తా’ అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు YSRను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? అని ప్రశ్నించారు.

మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ కు YSR గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు వైయస్ షర్మిల. పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదని అన్నారు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.

“కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మరు. ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడకుంటున్న రేవంత్ కు YSR అభిమానులే బుద్ధి చెప్తారు. YSR సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ. ఆ మహానేత ఆశయ సాధన కోసం 3800 కి.మీ. పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది YSR బిడ్డ మాత్రమే” అన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news