తొమ్మిది ఏళ్లగా కడపులో రాతిపిండాన్ని మోస్తున్న మహిళ

-

తల్లి తన బిడ్డను తొమ్మిది నెలల మోస్తుంది.. నరకకయాతన తర్వాత ఎట్టకేలకు ప్రసవిస్తుంది.. ఇది సృష్టిలో ఎక్కడైనా జరిగే ప్రక్రియ..కానీ ఓ మహిళ తొమ్మిది ఏళ్లగా..పిండాన్ని కడుపులో మొస్తుంది తెలుసా..? ఆశ్చర్యంగా ఉంది కదూ..! లిథోపెడియన్…ఇదొక అరుదైన ఆరోగ్య సమస్య. వైద్యులు చెబుతున్న ప్రకారం.. ఈ సమస్యలో తల్లి గర్భంలో ఉన్న పిండం రాయిలా గట్టి పడిపోతుంది. అది చుట్టూ ఉన్న పేగులను తన విధులను నిర్వహించకుండా అడ్డుకుంటుంది. తద్వారా శరీరం ముఖ్యమైన పోషకాలను గ్రహించలేక, పోషకాహార లోపం బారిన పడుతుంది.

ఈ వ్యాధి ముదిరితే.. మరణం వరకూ సంభవిస్తుంది.. అమెరికాలోని ఓ మహిళ ఈ ఆరోగ్య సమస్య బారిన పడింది. కాంగో దేశానికి చెందిన ఓ మహిళ అమెరికాకు వచ్చింది…ఆమె తొమ్మిది ఏళ్ల క్రితం గర్భాన్ని పోగొట్టుకుంది, కానీ గర్భసంచిని శుభ్రం చేయించలేదు. దీంతో పిండం లోపలే ఉండిపోయి, గట్టిగా కాల్సిఫైడ్ పిండంగా మారిపోయింది. అలా తొమ్మిదేళ్ల పాటు ఆ రాతి పిండాన్ని మోస్తూనే తిరిగింది ఆ మహిళ. దీంతో ఆమె పేగులు మూసుకుపోయి, తీవ్రమైన పోషకాహార లోపం వచ్చింది. కడుపునొప్పి, అజీర్ణం బారిన పడింది.

మహిళ కడపునొప్పి భరించలేక ఆసుపత్రికి వెళ్తే.. స్కానింగ్‌ చేసిన వైద్యులు ఆమె కడుపులో రాతి పిండం ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆహారం తింటే కడుపునొప్పి అధికంగా రావడంతో ఆమె తినడం కూడా మానేసిందట. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరింది. ఇన్నాళ్లు ఆమె తన పొట్టలో పిండం ఉన్న సంగతి తెలిసి కూడా ఎందుకు క్లీన్ చేయించుకోలేదని వైద్యులు ప్రశ్నించారు. దానికి ఆమె తాను డ్రగ్స్ తీసుకోవడం వల్లే బిడ్డ చనిపోయిందని తనపై వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారేమో అని భయపడి చికిత్సకు నిరాకరించినట్టు ఆమె చెప్పింది.

1966 నుండి ఇప్పటివరకు 16 కేసులను గుర్తించారు వైద్యులు. వీరిలో ఐదుగురు 65 ఏళ్ల పైబడిన వారు, వీరిలో చాలామంది ఒకటిన్నర సంవత్సరం నుంచి 35 ఏళ్ల వరకు రాతిపిండాన్ని మోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గర్భస్రావం అయ్యాక గర్భసంచిని క్లీన్ చేయించుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది లేదా ఇలా పిండం రాయిలా మారే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి కూడా అదే..

Read more RELATED
Recommended to you

Latest news