ఫిజికల్ టార్చర్ చేశారు.. కుటుంబ సమేతంగా హెచ్ఆర్‌సీకి పట్టాభి

-

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి బుధవారం తన కుటుంబ సమేతంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ను కలవడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు రాజీవ్ జైన్‌ ను కలిసి గన్నవరం ఘటన పై ఫిర్యాదులు చేపట్టారు. గన్నవరంలో జరిగిన అప్రాజస్వామిక దాడి, వాహనాల తగలబెట్టడం ధ్వంసం, పార్టీకి చెందిన అనేకమంది నాయకులను చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడంపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు పట్టాభి. తమ కార్యకర్తలను కొట్టారని… తనను ఫిజికల్ టార్చర్ చేశారని అయన తెలిపారు. జరిగిన సంఘటనలపై జిల్లా ఎస్పీ జాషువా, ఆయన కింద పని చేసిన అధికారులు తమపై దాడి చేస్తుంటే ఎక్కడ కూడా అదుపు చేయకుండా టీడీపీ నేతలనే అరెస్ట్ చేసారని ఆయన తెలిపారు పట్టాభి. తోట్లవల్లూరు స్టేషన్‌లో ముగ్గురు చేత 30 నిమిషాల పాటు తాను భౌతికంగా హింసించారన్నారు. ‘‘నన్ను అరెస్టు చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా చేశారు. కుటుంబ సభ్యులను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు’’ అని అన్నారు పట్టాభి.

 

జరిగిన అన్ని సంఘటనలను కమిషన్ సభ్యుడు రాజీవ్ కి చెప్పడం జరిగిందని అన్నారు పట్టాభి. టీడీపీ ను అరెస్ట్ చేసి భౌతికంగా ఏ విధంగా ఇబ్బందుల గురి చేశారనే అంశాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో దిగజారిపోయిన పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారని.. కమిషన్ సభ్యులు తమకు భరోసా కల్పించారని అన్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ తరపున ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇటువంటి దాడులకు అరెస్టులకు భయపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు పట్టాభి. రాజ్యాంగ బద్ధంగా ఉన్న అన్ని హక్కులను ఉపయోగించుకుంటామన్నారు. ఏ స్థాయిలో ఉన్న అధికారులను ఎవర్నీ కూడా విడిచి పెట్టే పరిస్థితి లేదని అన్నారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తాను ఏ రోజు భయపడి వెనక్కి పోయే వ్యక్తిని కాదని.. పోరాటం చేస్తానని తెలిపారు. రాష్ట్ర డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ లేఖ రాస్తామని చెప్పారన్నారు. అధికారులు ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదని వారిపై చర్యలు తప్పవని తెలిపారు. వైసీపీ సెక్షనలు అమలు చేయొద్దరి.. ఐపీసీ సెక్షన్ అమలు చేయాలన్నారు. మోచేతి నీళ్లు తాగుతూ అమ్ముడు పోయిన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని పట్టాభి తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news