ఫ్యాక్ట్ చెక్: హెల్మెట్ అవసరం లేదా..? వాట్సాప్ లో వస్తున్న మెసేజ్ లో నిజం ఎంత..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి నకిలీ వార్తలు కనపడుతూ ఉంటాయి. మీరు ఇలాంటి చూసి నమ్మితే కచ్చితంగా మోసపోవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలం లో నకిలీ వార్తలు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి అటువంటి వార్తలతో జాగ్రత్త పడాలి. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. మరి అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ద్విచక్ర వాహనం మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ తప్పక పెట్టుకోవాలి. హెల్మెట్ ధరించకపోతే ఫైన్ కూడా వేస్తారు. పైగా హెల్మెట్ చాలా ముఖ్యమని మనకి తెలుసు కానీ చాలా మంది ద్విచక్ర వాహనాల మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ ని పెట్టుకోరు. అయితే సోషల్ మీడియాలో హెల్మెట్ ని పెట్టుకోకపోయినా ఏమీ అవ్వదని హెల్మెట్ లేకుండా ఇప్పుడు వెళ్ళచ్చని కోర్టు హెల్మెట్ చెక్ చేయడానికి నిలిపి వేసిందని… అన్ని రాష్ట్రాల్లో ఇది వర్తిస్తుందని ఒక వార్త సోషల్ మీడియాలో వచ్చింది.

మరి ఇది నిజమా కాదా అనేది చూస్తే.. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోక్కర్లేదు అని వస్తున్న వార్త వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. దీనిలో ఏ మాత్రం నిజం లేదు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం హెల్మెట్ ధరించడం ముఖ్యము. ఒకవేళ కనుక హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని చూసి మోసపోకండి. పైగా ఇది మన సేఫ్టీ కోసమే కాబట్టి తప్పక డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ని ధరించండి.

Read more RELATED
Recommended to you

Latest news