బెంగళూరులో మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. దాదాపు రూ.4250 కోట్లతో 13.71 కిలోమీటర్ల మేర మెట్రోను నిర్మించారు. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన బెంగళూరులో ట్రాఫిక్ రద్దీతో చాలా కాలంగా ఇబ్బంది పడుతోంది. ఈ మెట్రో లైన్ ప్రారంభోత్సవంతో, బెంగళూరులోని ప్రయాణికులు నగరం చుట్టూ తిరగడానికి మరింత సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలు ప్రయాణికులకు అందుతాయని మోడీ తెలిపారు. ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని భారత ప్రభుత్వం అందిస్తుందన్నారు.
బెంగుళూరులోని కడుగోడి నుండి కృష్ణరాజపుర మార్గాన్ని సుందర వనంగా తీర్చి దిద్దినట్లు మోడీ కొనియాడారు. భారతదేశ ప్రధానమైన వందే భారత్ రైళ్లు కూడా భారతీయ రైల్వేలను అప్‌గ్రేడ్ చేసిన తర్వాతే రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశాన్ని నూతన శకం వైపు నడిపించడంలో రైల్వె కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రపంచం భారత్ చూస్తుందని మోడీ అన్నారు. శాస్త్రసాంకేతిక రంగాలలో భారత్ శక్తిసామర్ద్యాలు చాటుతుందన్నారు. యువతరం ఆదిశగా అడుగులేయాలని మోడీ పిలుపునిచ్చారు.