హీరోయిన్ లయ ఐటీ సెక్టార్ లో నెలకు అంత శాలరీ తీసుకున్నారా..?

-

సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు ఇవ్వరు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా శ్రీ రెడ్డి లాంటి వాళ్లు కూడా తెలుగమ్మాయిలకు టాలీవుడ్ లో అన్యాయం చేస్తున్నారు అంటూ నగ్నంగా మా అసోసియేషన్ ముందు బైఠాయించిన విషయం తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దాదాపు 13 సంవత్సరాల పాటు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది లయ. దీన్ని బట్టి చూస్తే ఆమె తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఏ విధంగా అలరించిందో అర్థం చేసుకోవచ్చు.

స్వయంవరం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన లయ ఆ తర్వాత ఎన్నో సినిమాలు ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. దాదాపు 13 సంవత్సరాల పాటు నిర్విరామంగా పనిచేసిన ఈమె ఆ తర్వాత వివాహం చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది. ఇటీవల అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చిన లయ ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంది. ఈ క్రమంలోనే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేసినప్పుడు తన నెల సంపాదన కూడా తెలియజేసింది. 2011 నుంచి అక్కడ ఐటీ సెక్టార్ లో ఇండియన్ కంపెనీకి చెందిన కంపెనీలో ఉద్యోగం చేసిందట. 2017 వరకు ఐటీ సెక్టర్ల ఉద్యోగం చేసి మానేశానని తెలిపింది.

అక్కడ నెలకి ఖర్చులకు పోను 12 డాలర్లు అంటే 9,60,000రూపాయలను నెలజీతంగా తీసుకున్నదట లయ . ఈ మొత్తాన్ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే 2017 లో ఉద్యోగానికి స్వస్తి పలికి ఒక డాన్స్ స్కూల్లో ప్రారంభించిందట.అయితే కరోనా వల్ల అది మూసి వేయబడడంతో ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఇప్పుడు పాపులారిటీ దక్కించుకుంటుంది. మొత్తానికైతే అమెరికా కంటే హైదరాబాద్ బాగుంది అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news