అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్లో రికార్డు సెంచ‌రీ

-

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్ టోర్న‌మెంట్ల‌లో ప‌సికూన దేశాలు రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఇటీవ‌ల ఐసీసీ చాలా చిన్న దేశాల‌కు టీ20 క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలోనే చాలా దేశాలు టీ20 ఆడుతున్నాయి. ఈ ప‌రంప‌ర‌లోనే స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అంతర్జాతీ టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది.

సింగ‌పూర్‌లో జ‌రుగుతోన్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ కెప్టెన్‌ పరాస్‌ ఖడ్కా శతకంతో చెలరేగాడు. పరాస్‌ 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 106 పరుగులు చేశాడు. ఈ క్ర‌మంలోనే సింగ‌పూర్ విధించిన 152 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నేపాల్ కేవ‌లం 16 ఓవ‌ర్ల‌లోనే కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి చేధించింది.

ఈ క్ర‌మంలోనే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో ఛేజింగ్‌లో తొలి సెంచ‌రీ చేసిన కెప్టెన్ రికార్డుతో పాటు నేపాల్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు. ఇక ఈ క్ర‌మంలోనే మూడో రికార్డు సైతం సాధించాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించి వేగవంతంగా ఈ ఫీట్‌ సాధించిన నాలుగో ఆసియా కెప్టెన్‌గా నిలిచాడు.

ఇక ఈ మ్యాచ్‌లో సింగ‌పూర్ ముందు బ్యాటింగ్ చేసి 151 ప‌రుగుల చేసింది. సింగపూర్‌ కెప్టెన్‌ టిమ్‌ డేవిడ్‌(64 నాటౌట్‌) రాణించగా, సురేంద్రన్‌ చంద్రమోహన్‌(35) ఫర్వాలేదనిపించాడు. ఏదేమైనా టీ20 క్రికెట్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్‌కు రోజురోజుకు ఆద‌ర‌ణ మ‌రింత‌గా పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news