తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో హిందీ పేపర్ లీక్ అయిన వ్యవహారం పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పేపర్ ఎక్కడ లీక్ కాలేదని స్పష్టం చేశారు మంత్రి సబితా. 10వ తరగతి పరీక్షల విషయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్‌మెంట్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
4 లక్షల 95 వేల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా పనిచేద్దామని తెలియజేసుకుంటున్నానన్నారు. మొదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్థితులకు గురిచేయడానికి ఎవరు ప్రయత్నించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యార్థుల పరీక్షల విషయంలో రాజకీయ స్వార్ధం, వ్యక్తిగత స్వార్ధం పక్కన పెట్టాలని మనవి చేశారు.