కేసీఆర్ సర్కార్‌పై కమలం ఫైర్..బండినే టార్గెట్ చేశారుగా!

-

తెలంగాణలో వరుస పేపర్ల లీకేజ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్లు లీక్ అయ్యాయి..దీనిపై ప్రతిపక్షాలు..కే‌సి‌ఆర్ సర్కారు టార్గెట్ గా విరుచుకుపడుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో టెన్త్ ప్రశ్నా పత్రాలు సైతం వరుసగా లీక్ అవుతూ వస్తున్నాయి. దీనిపై కూడా ప్రతిపక్షాలు కే‌సి‌ఆర్ సర్కారుని గట్టిగా టార్గెట్ చేశాయి. ముఖ్యంగా ఈ అంశంపై బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..కే‌సి‌ఆర్ సర్కారుని గట్టిగా టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు.

ఇదే క్రమంలో ఊహించని విధంగా బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది..అసలు ఎందుకు అరెస్ట్ చేశారు..ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. కానీ టెన్త్ పేపర్ల లీక్ అంశంలో ఆయన్ని అరెస్ట్ చేశారని ప్రచారం వస్తుంది.  వాస్తవానికి వరుసగా రెండో రోజు కూడా పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. హనుమకొండలో హెచ్‌ఎంటీవీ బ్యూరో మాజీ చీఫ్‌ బూరం ప్రశాంత్‌ ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ అంటూ దానిని వైరల్‌ చేశాడు.

Bandi Sanjay Arrested

అయితే హిందీ ప్రశ్న పత్రం లీకైందని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారంటూ బండి సంజయ్‌తోపాటు చాలామందికి దానిని ఫార్వార్డ్‌ చేశాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరింత వైరల్ అయింది. ఈ క్రమంలో బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి ల మధ్య మాటల యుద్ధం నడిచింది. అలాగే ప్రశాంత్‌కు, సంజయ్‌కు సంబంధం ఉందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. అయితే, మంత్రి ఎర్రబెల్లితోపాటు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే విజయ్‌ భాస్కర్‌ తదితరులతో ప్రశాంత్‌ దిగిన ఫొటోలను బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి బయట పెట్టారు. ప్రశాంత్ బి‌జే‌పి మనిషి అని ఆరోపించారు.

అయితే ఇలా పేపర్ లీకేజ్ పై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో బండిని అరెస్ట్ చేశారు. బండి అరెస్టుని అక్రమంగా అరెస్ట్ చేసారంటూ రాష్ట్ర వ్యాప్తంగా బి‌జే‌పి నేతలు..కే‌సి‌ఆర్ సర్కార్ పై ఫైర్ అవుతున్నారు. నిరసనలు తెలియజేస్తున్నారు. అలాగే వరుసపెట్టి బి‌జే‌పి నేతలని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే బండిని కావాలనే టార్గెట్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక బండి అరెస్ట్ పై బి‌జే‌పి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. చూడాలి బండి అరెస్టు పై ఇంకా ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news