ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు అయింది. నిన్న ఉదయం టెన్త్ పేపర్ లీక్ కేసులో పాత్ర ఉందని భావించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి హనుమకొండ కోర్టు లో ప్రవేశపెట్టారు. నిన్న సాయంత్రం జరిగిన వాదనల అనంతరం హనుమకొండ మేజిస్ట్రేట్ పోలీసులతో ఏకీభవించి బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ తీర్పును ఇచ్చింది. దీనితో బండి సంజయ్ తరపున న్యాయవాదులు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అయితే ఈ బెయిల్ కోసం న్యాయవాదులు దాదాపు 8 గంటలుగా వాదించారు. చివరికి బెయిల్ ఇవ్వడానికి హనుమకొండ కోర్టు జడ్జి అనుమతించింది. అయితే ఈ బెయిల్ ను ఇద్దరు వ్యక్తుల హామీ మరియు రూ. 20 వేల పూచీ కత్తు మీద బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేశారు. రేపు ఉదయం ఆయన విడుదల కానున్నారు.
మరి బండి సంజయ్ ఈ కేసు నుండి పూర్తిగా బయటపడడానికి ఈ విధమైన స్టెప్ తీసుకోనున్నారు అన్నది తెలియాల్సి ఉంది. బండి సంజయ్ విడుదల కానుండడంతో బీజేపీ కార్యకర్తలు మరియు అతని అభిమానులు ఆనందంగా ఉన్నారు.