పోస్ట్ ఆఫీస్ నుండి సూపర్ స్కీమ్…రూ.7 లక్షల పైనే రిటర్న్స్… నో రిస్క్..!

-

ఈ మధ్య కాలంలో ఎవరికి నచ్చిన స్కీముల్లో వాళ్ళు డబ్బులని పెడుతున్నారు. నిజానికి కేంద్రం అందిస్తున్న స్కీముల్లో డబ్బులు పెడితే చక్కటి లాభాలు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ ని పెంచింది. కనుక ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టిన వాళ్లకి ఇంకాస్త లాభం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ తీసుకు వచ్చిన స్కీమ్స్ లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కూడా ఒకటి. ఈ పాపులర్ స్కీమ్ గురించి అందరికీ తెలుసు.

ఈ స్కీము లో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ ఉండదు. రిటర్న్స్ వస్తాయి. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పథకాల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ షార్ట్ టర్మ్‌లో అంటే ఓ ఐదేళ్ల లో ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ కావాలనుకునేవారికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు కన్నా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు ఎక్కువ వస్తుంది. రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది.

వడ్డీ అయితే ఎక్కువ వస్తుంది. కనుక ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. ఇండియా లో అన్ని పోస్ట్ ఆఫీసు ల్లో ఈ స్కీము వుంది. ఈ స్కీమ్ లో ఒకేసారి డబ్బు పొదుపు చేసుకోవాలి. కనీసం రూ.1,000 నుండి జమ చేయొచ్చు. దీనిలో గరిష్ట పరిమితి లేదు. ఎవరైనా సరే వీటిలో డబ్బులని పెట్టచ్చు. జాయింట్ అకౌంట్ ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎప్పుడు పొదుపు చేసినా రిటర్న్స్ కోసం ఐదేళ్లు ఎదురు చూడాలి.

మెచ్యూరిటీ సమయం లో మీకు అసలు తో పాటు వడ్డీ కూడా వస్తుంది. ఈ స్కీమ్‌లో రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.1,403 రిటర్న్స్ మీకు వస్తాయి. రూ.1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.1,40,300 రిటర్న్స్, రూ.5,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.7,01,500 రిటర్న్స్ ని మీరు పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి,

Read more RELATED
Recommended to you

Latest news