నేడు మల్కాజ్ గిరి కోర్టు తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మల్లన్నతో పాటు మరో నలుగురికి వచ్చింది. ఒక్కొక్కరికి రూ.20వేలు ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. రెండు కేసుల్లో రెగ్యూలర్ బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై తుది తీర్పును మల్కాజ్ గిరి కోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేశారు. రెండవ కేసు బెయిల్ పిటిషన్ పై పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించిన మల్లన్న న్యాయవాది.. అదే రోజే అంటే (ఏప్రిల్ 12న) ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. ఏప్రిల్ 13న ఒక్కరోజే వర్కింగ్ డే అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియచేశారు. ఈ క్రమంలో తీర్పును ఏప్రిల్ 17.. అంటే సోమవారానికి వాయిదా వేస్తూ.. ఆదేశాలు ఇచ్చారు.
ఏప్రిల్ 11న తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టగా.. నాన్ బెయిలబుల్ సెక్షన్ అసలు మల్లన్నపై వర్తించదని మల్లన్న తరపు న్యాయవాది కోర్టుకు తెలియచేశారు. బెయిల్ అడ్డుకోవడానికి పాత వారెంట్స్ తెర మీదకు తెస్తున్నారని తెలిపారు. సాంకేతిక కారణాలు చూపించి బెయిల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మల్లన్న న్యాయవాది వాదించారు. తీన్మార్ మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90 కేసులు నమోదయ్యాయి. నోటీసు ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్ చేశారని మల్లన్న భార్య మమత ఏప్రిల్ 3వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేపట్టారు.