ఇది సొంత పార్టీ వ్యవహారం కాదు. ఉన్న పార్టీ అంతర్గత రహస్యం అసలే కాదు. పక్క పార్టీనేత ఇంకో పార్టీ పగ్గాలు చేపడితే ఎంత పొడిచిచూపించేవాడినో మాటలతో చెప్పలేను అనే డాంభికంతో కూడుకున్న వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్ మోస్ట్ జూనియర్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్టు మంత్రిగా కూడా పనిచేసిన రెడ్యానాయక్ ప్రస్తుతానికి అధికార బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన సొంత పార్టీలో జరిగిగే వ్యవహారాలగురించి ఏనాడూ స్పందించిన దాఖలాలు లేవు గానీ, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకుని సెకండ్లలో స్పందిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన రెడ్యా నాయక్.. రాహుల్ గాంధీనీ సస్పెండ్ చేస్తే ఓ పీసీసీ చీఫ్ గా రేవంత్ కనీసం నిరసన కార్యక్రమాలు చేయలేదని ఎద్దేవా చేశారు. అదే తానయితే రాష్ట్రంలో హల్ చల్ చేసేటోడినంటూ రెడ్యా నాయక్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయనను దించాలని చూస్తున్నారన్నారు.
ఈ ఒక్కసారి తాను ఎన్నికల్లో నిలబడతానన్న రెడ్యా నాయక్..బీఆర్ఎస్ కు ఈ సారి 90 కి పైగా సీట్లు వస్తాయన్నారు. ఎన్టీ రామారావు అటువంటి గాలిలో 26 వేల మెజార్టీతో గెలిచానని…2014 లో టీఆర్ఎస్ గాలిలో సైతం 25 వేల మెజార్టీ తో గెలిచనన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క పథకం కూడా ఇవ్వడం లేదన్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి రెడ్యా పోటీలో ఉండరు ఆయన స్థానంలో ఆయన వారసులు టికెట్ ఆశిస్తున్నారు అనే ప్రచారానికి రెడ్యా నాయక్ మరోసారి చెక్ పెట్టారు. నేను పోటీలో ఉంటా డోర్నకల్ కార్యకర్తల అండతో ఈ ఒక్కసారి బరిలో నిలుస్తా అని మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు ఆత్మీయ సమావేశం లో ప్రకటించి మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్ పరోక్షణ కౌంటర్ ఇచ్చారు.