ఆ మంత్రిని టార్గెట్ చేసిన లోకేష్..హ్యాట్రిక్ దక్కకుండా.!

-

Lokesh: పాదయాత్రతో నారా లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే..తనదైన శైలిలో ప్రజల్లోకి వెళుతున్న లోకేష్‌కు ప్రజల మద్ధతు బాగానే వస్తుంది. పాదయాత్ర విషయంలో లోకేశ్ బాగా తెలివిగా ముందుకెళుతున్నారు. ఓ వైపు ప్రజలని కలుస్తూనే..మరోవైపు కులాల వారీగా ప్రజలతో మాట్లాడుతూ..వారి సమస్యలని తెలుసుకుని..ఆ కులాల మద్ధతు టి‌డి‌పికి పెంచుతున్నారు. అదే సమయంలో వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.

ఓ వైపు రాష్ట్ర స్థాయిలో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే..మరోవైపు ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేలని లోకేష్ టార్గెట్ చేస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో సరైన అభివృద్ధి చేయకపోవడం, అక్రమాలు జరగడంపై పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. పలు ఆధారాలతో సహ అక్రమాలని వివరిస్తున్నారు. ఇటీవల కాలంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డిని ఏ విధంగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ప్రజల్లో ఉండే ఎమ్మెల్యేలనే గట్టిగా టార్గెట్ చేశారు..ఆయన యూట్యూబ్ పేరిట డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.

lokesh
lokesh

ఇక తాజాగా ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం టార్గెట్ గా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. భూ కబ్జాలు, పేకాట క్లబ్బులు, అక్రమ ఇసుక..ఇలా ఆయనపై చాలా ఆరోపణలు వచ్చాయి..ఆ ఆరోపణలని ఆధారాలతో సహ లోకేష్ ప్రజలకు వివరించారు. దీంతో లోకేష్ పై మంత్రి తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ వచ్చారు.

ఈ క్రమంలో మళ్ళీ జయరాంని లోకేశ్ టార్గెట్ చేశారు. గతంలో జయరాం..బెంజ్ కారు లంచంగా తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంజ్ మంత్రి గారూ బీపీ, బూతులు ఎందుకు? అని మంత్రి గుమ్మనూరు జయరాంపై లోకేష్ విరుచుకుపడ్డారు. తాను అడిగిన దానికి తప్ప ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ నోరు పారేసుకోవడం ఎందుకని నిలదీశారు. అలాగే ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో స్కాంకి పాల్పడి మీరు బెంజ్ కారు గిఫ్ట్‌గా తీసుకున్నారని ఆధారాలతో సహా ఎన్నో సార్లు బయటపెట్టామని అన్నారు. మొత్తానికి ఆలూరులో మళ్ళీ జయరాంని గెలవనివ్వకుండా చేయడమే టార్గెట్ గా లోకేష్ ముందుకెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news