భూమి అమ్మకం విషయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఊరట లభించింది. రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ భూమిని.. డీఎల్ఎఫ్కు బదిలీ చేయడంలో ఎటువంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని హర్యానా ప్రభుత్వం.. హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలిపింది.
2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. అప్పటి ముఖ్యమంత్రితో కలిసి రాబర్ట్ వాద్రా అక్రమ భూలావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీజేపీ మాటమార్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలకు.. అధికారంలోకి వచ్చాక క్లీన్ చిట్ ఇచ్చింది. రాబర్ట్ వాద్రా ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని తెలిపింది. పంజాబ్ హర్యానా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. రాబక్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ల్యాండ్‌ను, డీఎల్ఎఫ్కు బదిలీ చేయడంలో ఎటువంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని హరియాణా ప్రభుత్వం పేర్కొంది.
“స్కైలైట్ హాస్పిటాలిటీ DLF యూనివర్సల్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాలను విక్రయించినట్లు మానేసర్ తహసీల్దార్ నివేదించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఈ లావాదేవీలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘన జరగలేదని తేలింది.” అని పంజాబ్ హర్యానా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ప్రభుత్వం తెలిపింది.