లేస్‌ ప్యాకెట్లతో సన్‌ గ్లాసెస్‌.. పిచ్చెక్కిస్తున్న క్రియెటివిటీ..!

-

Sunglasses: కళకు కాదేది అనర్హం అనే నానుడి మనకు బాగా తెలుసు.. ఇప్పటికే చాలా మంది ఇవి నిరూపించారు కూడా.. దీంతో కూడా ఇలా చేస్తారా అని మనల్ని ఆశ్యర్యపరిచారు. ఈరోజుల్లో ఏకో ఫ్రెండ్లీ అనే కాన్సప్ట్‌ బాగా ఎక్కువైంది. దేన్నిపాడేయకుండా.. పర్యావరణానికి హానికలగించకుండా చేస్తున్నారు. మార్కెట్లో దొరికే లేస్‌, కుర్‌ కురే వంటి చిరుతిళ్ల ప్యాకెట్లను ఖాళీ చేసి మనం చెత్తలో పడేస్తుంటాం. అలాంటి వాటిని సేకరించి ‘ఆశయ’ అనే స్టార్టప్‌ కంపెనీ స్టైలిష్‌ సన్‌గ్లాసెస్‌ తయారు చేస్తోంది. ప్యాకెట్లతో సన్‌గ్లాసెస్‌ ఏంట్రా అనే కదా మీ డౌట్..!

ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు.. ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. తన వంతుగా ఏం చేయొచ్చని ఆలోచించాడు అనిశ్‌ మల్పానీ (Anish Malpani) అనే యువకుడు. ఆ దిశగా ప్రయత్నాలు చేసేందుకు ‘ఆశయ’ అనే స్టార్టప్‌ కంపెనీని నెలకొల్పాడు. ప్లాస్టిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తే బాగుంటుందనే విషయంపై అనిశ్‌ సుమారు రెండేళ్లు పరిశోధన చేసి…ల్యాబ్‌లో రకరకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి చలువ కళ్లద్దాలు తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దాంతో చిప్స్‌ ప్యాకెట్లు మాత్రమే కాకుండా చాక్లెట్‌ పేపర్లు, టెట్రా ప్యాక్‌లు వినియోగించి స్టైలిష్‌ సన్‌ గ్లాసెస్‌ తయారు చేశారు.

ప్రపంచంలోనే తొలిసారి తాము చిప్స్ ప్యాకెట్ల వ్యర్థాల నుంచి చలువ కళ్లద్దాలు తయారు చేశామని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించి అనిశ్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తొలుత ఈ ప్రకటనను చాలా మంది కొట్టి పడేశారు. కానీ, కళ్లద్దాలు తయారు చేసిన విధానం గురించి పూర్తి వీడియో చూశాక అంతా నమ్మక తప్పలేదు. తమ ఈ వ్యాపార ప్రయత్నం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అనిశ్‌ విశ్వసిస్తున్నారు.

 

sunglasses
sunglasses

తొలుత 500 ఆర్డర్లు

అనిశ్‌ తాను తయారు చేసిన సరికొత్త కళ్లద్దాల గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగానే సుమారు 500 ఆర్డర్లు వచ్చాయట. నిజానికి వీటిని ఎవరైనా కొంటారా? అనే సందేహం అనిశ్‌కు ఉండేదట. కానీ క్రమంగా ఆర్డర్లు ఊపందుకోవడంతో ఆనందపడ్డాడు. చలువ కళ్లద్దాల తయారీతో కేవలం చెత్త సమస్యకు మాత్రమే పరిష్కారం చూపలేదు. చెత్త ఏరుకుంటూ జీవించే వారి బతుకుల్లో మార్పు తేవడం కోసం ఆ పని చేసే ఆరుగురిని తన ల్యాబ్‌లో ఉద్యోగులుగా చేర్చుకున్నాడు. అంతే కాదు కంపెనీలో వచ్చిన ఆదాయంలో 10 శాతాన్ని చెత్త ఏరుకుని జీవించే వారి పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని ప్రకటించాడు.

అనిశ్‌ తన చలువ కళ్లద్దాలకు ‘విత్‌ అవుట్‌’ అని పేరు పెట్టాడు. కొత్త వస్తువు ఏదైనా మార్కెట్లోకి విడుదల చేస్తే దాని పేరు సరి కొత్తగా ఉంటేనే జనాలను ఆకర్షిస్తుంది. అందుకే ఓ స్నేహితుని సూచన మేరకు ఆ పేరు పెట్టాడు. ఇక ఈ విత్‌ అవుట్ సన్‌ గ్లాసెస్‌ మన్నిక కూడా ఎక్కువేనట. వాటిని కారుతో తొక్కించినా పగిలిపోవని అనిశ్‌ చెబుతున్నారు. సూర్యకాంతి నుంచి రక్షణ కోసం ఈ అద్దాల్లో యూవీ పోలరైజ్డ్‌ సాంకేతికత వినియోగించారు. ఈ కళ్లద్దాల ఫ్రేమ్‌పై ఉన్న క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన వ్యర్థాలను ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు, తయారీలో ఎవరు పాల్గొన్నారు వంటి సమాచారం దొరుకుతుంది. క్రేజీగా ఉంది కదూ..!

Read more RELATED
Recommended to you

Latest news