విద్యార్థులకు అలర్ట్‌.. ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్

-

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులును ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరం జూన్12 న ప్రారంభం కానుంది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు SA – II పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Good news for class 1st to 12th students, holiday declared, MP Schools will  be closed for 10 days in October, School Education Department issued order  | MP School: छात्रों-शिक्षकों के लिए अच्छी

ఒక‌టి నుంచి ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12 వ‌ర‌కు, ఆరు నుంచి ఎనిమిది త‌ర‌గ‌తుల‌కు 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:15 గంట‌ల వ‌ర‌కు, తొమ్మిదో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఉద‌యం 9:30 నుంచి మ‌. 12:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నారు. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు ప‌రీక్షా ప‌త్రాల‌ను మూల్యాంక‌నం చేయ‌నున్నారు. ఆ తరువాత విద్యార్థులకు మార్కులు చెప్పి సెలవులు ఇస్తారు.

ఇది ఇలా ఉంటె, ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ.. 1 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి. అలాగే ఆ తర్వాత పరీక్షల ఫలితాలు, పేరెంట్స్ మీటింగ్స్ నిర్వహించనుండటంతో ఏప్రిల్ 30 నుంచి వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు అనధికారికంగా సమాచారం ఇచ్చారు. ఇక 2023-24 విద్యాసంవత్సరానికి గానూ స్కూల్స్ జూన్ 12 నుంచి తిరిగి పున: ప్రారంభం కానున్నాయి. అలాగే 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగనుండగా.. ఆ వెంటనే టెన్త్ విద్యార్ధులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news