‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో త్రిష, ఐశ్వర్యారాయ్ రాయల్ లుక్‌లో సందడి చేశారు. వీరి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
త్రిష ఈ ఈవెంట్ కోసం బ్లాక్ శారీని ఎంచుకుంది. రాయల్ లుక్‌లో ఈ చెన్నై చిన్నది అదిరిపోయింది. క్యూట్ క్యూట్ స్మైల్‌తో ఈ ఈవెంట్లో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందులో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ కూడా పాల్గొంది. ఐశ్వర్య ఉన్నా.. త్రిష ఈవెంట్ మొత్తం తనవైపే చూసేలా చేసిందంటే ఎంత అందంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక పీఎస్2 ప్రమోషన్స్ కోసం త్రిష సెలెక్ట్ చేసుకుంటున్న ఔట్ఫిట్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రతి ఈవెంట్‌కు ట్రెడిషనల్‌గా వస్తూనే.. డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న త్రిష డ్రెస్సింగ్ స్టైల్ చూసి మెస్మరైజ్ అవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రమోషన్స్‌లో త్రిష బ్లాక్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజుల్ మెడలో డైమండ్ నెక్లెస్‌తో సింపుల్ బట్ ఎలిగెంట్‌గా అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.