Google Pay యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈజీగా లోన్ పొందే అవకాశం..

-

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి Google Pay, ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్లను వాడుతారు.. గూగుల్ పే తన కస్టమర్లకు తాజాగా అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. కస్టమర్లకు అదిరే శుభవార్త తీసుకువచ్చింది. ఈజీగా పర్సనల్ లోన్ పొందే వెసులుబాటు అందుబాటులో ఉంచింది. అందువల్ల మీరు గూగుల్ పే ద్వారా ఈజీగా లోన్ పొందొచ్చు.. గూగుల్ పే నేరుగా ఎలాంటి రుణాలు అందించదు. ఇది ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లెండింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను తన యాప్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచుతుంది..

google pay
google pay

 

మీరు గూగుల్ పే ద్వారా ఏకంగా రూ. 8 లక్షల వరకు డబ్బులు పొందొచ్చు. మీరు రుణ అర్హత ప్రాతిపదికన మీకు లోన్ వస్తుందా.. లేదా అన్నది తెలుస్తుంది..క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ కెపాసిటీ వంటి పలు అంశాల ప్రాతిపదికన రుణ అర్హత నిర్ణయం అవుతుంది. మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే.. ఈజీగా బ్యాంక్ అకౌంట్‌లోకి లోన్ డబ్బులు వచ్చేస్తాయి. లేదంటే లేదు. రూ. 8 లక్షల వరకు ఎంత మొత్తం అయినా లోన్ రూపంలో పొందొచ్చు..

లోన్ ను ఎలా పొందాలి..?

గూగుల్ పే ద్వారా లోన్ పొందాలని భావించే వారు ముందుగా గూగుల్ పే యాప్‌లోకి వెళ్లాలి.

అక్కడ లోన్స్ ఆప్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు డీఎంఐ ఫైనాన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి..

డీఎంఐ ఫైనాన్స్ కస్టమర్లకు రూ. 10 వేల నుంచి రూ. 8 లక్షల వరకు రుణాలు అందిస్తోంది. నెలవారీ రీపేమెంట్ రూ. 500 నుంచి ప్రారంభం అవుతుంది.

మీరు తీసుకున్న రుణానికి 6 నెలల నుంచి ఈఎంఐ టెన్యూర్ పెట్టుకోవచ్చు..

వడ్డీ రేటు అనేది 15 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. లోన్ పొందాలని భావించే వారు అక్కడి నుంచే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

2 నిమిషాల్లోనే లోన్ ఎలిజిబిలిటీ తెలిసిపోతుంది. లోన్ అర్హత ఉంటే.. అప్లై చేసుకోవచ్చు..

పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

పాన్ కార్డు వివరాలు ఎంటర్ చేయగానే మీకు లోన్ వస్తుందా? రాదా? అని తెలిసిపోతుంది.. ఇక ఆలస్యం ఎందుకు మీకు డబ్బులు అవసరం ఉంటే ఇలా ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news